సంచలనాలకు మారు పేరుగా నిలిచిన రిలయన్స్ జియో ఫైబర్తన బ్రాడ్ బ్యాండ్ సేవలను, దేశ వ్యాప్తంగా 1600 నగరాల్లో ప్రారంభించి ంచింది. 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీపీఎస్ వేగంతో అపరిమిత సేవలను అందిస్తోంది, నూరు శాతం ఆప్టికల్ ఫైబర్తో సేవలు అందిస్తున్న తొలి బ్రాడ్ బ్యాండ్ జియో ఫైబర్ అవుతుంది. వినియోగదారులకు సేవలకు 699 రూపాయలు మొదలుకుని 8499 రూపాయల వరకు పథకాలను రిలయన్స్ సంస్థ ప్రకటించింది. ఇక సంస్థ వినియోగదారులకు ప్రకటించిన ప్రారంభ ఆఫర్లలో 699 రూపాయల పథకానికి మూడు నెలలపాటు జియో సినిమా, జియో సావన్ ఓటీటీ యాప్లు ,849 రూపాయల ప్లాన్ కు మూడు నెలల పాటు ఓటీటీ యాప్ సేవలన్నీ ఉచితం. 1299రూపాయలు ఆ పైన అద్దె పధకాలకు ఏడాది పాటు ఓటీటీ యాప్ల కంటెంట్ ఉచితమని సంస్థ ప్రకటించిందిప్రతి చందాదారు ప్రారంభంలో 2500 రూపాయలు చెల్లించాలిదీనిలో 1500 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కింద తీసుకుంటారుదీనిని కనెక్షన్లు వాపసు తీసుకునప్పుడు తిరిగి ఇచ్చి వేస్తారు. మిగిలిన 1000 రూపాయలను ఇన్స్టలేషన్ ఛార్జీల కింద తీసుకుంటారు. ప్రతి కనెక్షన్ తో పాటు జియో హై డెఫినిషన్ హెచ్డి సెట్టాప్ బాక్స్ ఉచితం. వైఫైతో పాటు ఒకే సారి ఆరు నుంచి ఎనిమిది పరికరాలను వాడు కోవచ్చు. కొత్త సినిమాలను విడుదల రోజే చూడాలనుకున్న వారికి 2499రూపాయలు అంత కన్నా ఎక్కువ అద్దె పథకాల్లో చేరాలి. వారికి మాత్రమే ఈ అవకాశం వుంటుంది. వార్షిక పథకాల్లో పథకాల్లో చేరిన వారికి టీవీ ఉచితం. 699 నుంచి 849 రూపాయల నెల వారీ చెల్లింపులను వార్షికంగా చెల్లిస్తే బ్లూటూత్ స్పీకర్, 1299రూపాయల అద్దెను రెండేళ్లకు చెల్లిస్తే 24 అంగుళాల టీవీని ఇంకా అనేక ఆఫర్లను ప్రకటించింది. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే పదవ వంతు కే ఇక్కడ సేవలు అందు బాటులోకి తెచ్చినట్టు సంస్థ ప్రకటించింది - కాశీభట్ల
సంచలనాల జియో ఫైబర్