30 ప్రశ్నలను సలహా కోసం లిస్ట్ చేసింది. వీటిని సంక్షిప్తం చేసి సలహా కోసం కింద ఇస్తున్నాం
1. అలాకార్టీ నుంచి బోకే ఛానెళ్ల ధర ఫ్లెక్సిబులిటిని బ్రాడ్ కాస్టర్లు ధుర్వినియోగం చేస్తున్నారా? దానికి గాను తీసుకోవలసిన నివారణ చర్య లేమిటి?
2. కొంత మంది బ్రాడ్ కాస్టర్లు 15 శాతం కు మించి బోకేలకు ఎక్కువ డిస్కౌంటు ఇస్తున్నారు. దీని వల్ల ఇతర బ్రాడ్ కాస్టర్ల ప్రయోజనాలకు భంగం వాటిల్లదా ?
3. అలా కార్టీ నుంచి బోకే ధరల్లో 15 శాతం క్యాప్ ను తిరిగి ప్రవేశ - పెట్టాలా? క్యాప్ ను ఏ విధంగా లెక్కించాలి?
4. క్యాప్ విషయంలో కూడా డిపివోలు డిస్కౌంటు ఇవ్వాలా? దానిని ఏ విధంగా లెక్కించాలి.?
5. అనవసరమైన ఛానెళ్లను వినియోగదారులపై రుద్దకుండా వుండటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
6. బ్రాడ్ కాస్టర్లు , డిపివోలు ఎక్కువ బోకేలను ఆఫర్ చేస్తున్నారా? వాటిని ఏ విధంగా పరిమితం చేయాలి.( రాష్ట్ర, ప్రాంత మార్కెట్ లక్ష్యంగా)