ట్రాయ్ 30 ప్రశ్నలను సలహా కోసం లిస్ట్ చేసింది. వీటిని సంక్షిప్తం చేసి సలహా కోసం కింద ఇస్తున్నాం

7. అలాకార ఎంఆర్పీ రేట్లపై విధించిన 19 రూపాయల సీలింగ్ పరిమితిని సమీక్షించాలా? ఎందుకు?


8. కొత్త టారీఫ్ ఆర్డర్ లో బోకేలు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడగలవా?


9. బోకేల కారణంగా వినియోగదారులు తమకు నచ్చిన టీవీ ఛానెళ్లను ఎంపిక చేసుకోలేక పోతున్నారా? 10. వినియోగదారులు ఎంపిక చేసుకునే ఛానెళ్ల ప్రక్రియను ఏ విధంగా సులభతరం చేయవచ్చు?


11. గృహాంలో బహుళ ఎసిబిలు వున్నట్లయితే ఎస్సీఎఫ్, డిఆర్ పి డిస్కౌంట్లను అనుమతించడానికి నియమాల్లో మార్పులు చేయాలా?


12. బహుళ టీవీలు వున్న గృహాల్లో విభిన్న ఎంఆర్ పిలకు గాను బ్రాడ్ కాస్టర్లను అనుమతించాలా?


13. ఒకే గృహాంలో బహుళ ఎపిబిలు వున్న ట్లయితే డిస్ట్రిబ్యూటర్లను విడిగా ఛానెళ్ల ఎంపిక ప్రక్రియకు అనుమతించాలా?


14. దీర్ఘకాల సబ్ స్క్రిప్షన్ ను ఏ విధంగా నిర్వచించాలి?


15. దీర్ఘకాల సబ్ స్క్రిప్షన్‌కు గాను డిపివోలకు డిస్కౌంట్లు ఇచ్చే సదుపాయాన్ని అనుమతించాలా? అది ఒక్క ఎన్ సిఎఫ్ అయితే సరిపోతుందా? దానిని డిఆర్ పి కి కూడా వర్తింపజేయాలా? క్యాప్ కి డిస్కౌంట్ ఇవ్వాలా?


16. దీర్ఘ కాల సబ్ స్క్రిప్షన్లకు గాను డిస్కౌంట్ల సదుపాయాన్ని కలిపించడానికి బ్రాడ్ కాస్టర్లను అనుమతించలా? డిస్కౌంట్ కి కూడా క్యాప్ వుండాలా?క్యాప్ వుండాలా?


17. ఎన్‌సిఎఫ్, డిఆర్ పిలకు డిస్ట్రిబ్యూటర్లు ప్రమోషనల్ స్కీములను అమలు చేయడానికి అనుమతించలా? ఆ పథకాలకు గాను గరిష్ట కాలపరిమితి వుండాలా? ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఎంత వరకు అనుమతించాలి? వినియోగదారుల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలేమిటి?


 


18. ఎలక్ట్రానిక్ ప్రోగ్రాం గైడ్ లో ఛానెళ్లను ఏ విధంగా లిస్ట్ చేయాలి?


19. వివిధ ప్రాంతాలకు మారే విధంగా ఎన్ సి ఎఫ్ పర్మిట్ ను జారీ చేయాలా? దీనికి గాను ఆయా ప్రాంతాలను వర్గీకరించాలి.


20. ఎన్ సిఎఫ్ పరిమితిని 100 ఛానెళ్లకు గాను 130 రూపాయలు వున్న దానిని సవరించాలా? దూరదర్శన్ కు చెందిన 25 డిడి ఛానెళ్లను ఎన్‌సిఎ లో చేర్చాలా?


21- తప్పనిసరి క్యారీ చేయాల్సిన ఛానెళ్లకు సంబంధించి కేంద్ర సమాచార ప్రసార శాఖకు చేయవలసిన ప్రతిపాదనలున్నాయా?


22. పరిశ్రమకు చెందిన స్టేక్ హెల్డర్లు ఏ ఇతర సమస్య పైనైనా ప్రస్తుత కన్సల్టేషన్ కు తమ అభిప్రాయలను తెలియజేయవచ్చు. , స్థానిక కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్లు ఈ సలహా పత్రం పై స్పందించాలి. ఎసి సివో రెవిన్యూ పెరగడానికి సంబంధించి తమ డిమాండ్లను స్పష్టంగా వివరంగా అందుకు అనుగుణంగా తమ వాదనలను వినిపించవలసి వుంటుంది.


తుది గడువు


ఈ కన్సల్టేషన్ పేపర్ కి సంబంధించి పరిశ్రమకు చెందిన విభిన్న వర్గాల నుంచి అభిప్రాయాలను ట్రాయ్ సెప్టెంబర్ 16 ,2019 నుంచి ఆహ్వానించింది. కౌంటర్ కామెంట్స్ తదితర వాటిని 30 సెప్టెంబర్ 2019 నాటికి ఎలక్ట్రానిక్ ఫారంలో ( దీనికే ప్రాధాన్యత నిస్తారు). అరవిందకుమార్ అడ్వయిజర్ (బి& సిఎస్)టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియకు ఈ మెయిల్ ద్వారా పంపవలసి వుంటుంది. ఈ మెయిల్ ఐడి arvind@ trai.gov.in or vk agarwal@ trai.gov.in


సవరించే టారీఫ్ ఆర్డరకు తగు సూచనలు


కొత్త టారీఫ్ ఆర్డర్ వల్ల వనియోగదారులు తాము చూసిన ఛానెళ్లకే ఛార్జీలు చెల్లించే అవకాశం లభిస్తుంది. అంతే కాకుండా వినియోగదారులు తనకు కావలసిన చానెళ్లను ఎంపిక చేసుకునే వీలు వుంటుంది. అనవసరమైన ఛానెళ్లను చూసే వీలు వుండదు. దీని వల్ల వినియోగదారులకు అనవసర ఖర్చు తగ్గుతుంది. ఎందు కంటే బ్రాడ్ కాస్టర్లు అనవసర ఛానెళ్లతో బోకేలను ఏర్పాటు చేస్తున్నారు.


బ్రాడ్ కాస్టర్లు బోకేలను పెంచి, అలాకార్టే పద్దతిలో వున్న పేఛానెళ్ల ధరను ఒకటికి పదింతలు చెప్పి తప్పుడు ధరలతో వినియోగదారులను కలవర పెడుతోంది. కొత్త టారీఫ్ ఆర్డర్ రాక మునుపు అలాకార అనేక పేఛానెళ్ల ధరల వరిధి బోకే ధరలకన్నా పదింతలు ఎక్కువగా వుండేవి. ఈ విషయంలో బ్రాడ్ కాస్టర్ల దరల ప్రహసనాన్ని పరిశీ లించవలసిన అవసర ముంది.


పేటీవీ పరిశ్రమలో ఎప్పటి కప్పుడు తగువులు వుంటునే వుంటాయి. ట్రాయ్ రూపొందించిన ప్రతి నియమం కోర్టుల్లో సవాలుకు గురవుతు వుండేది. చివరికి సుప్రీం కోర్టు వరకు వెళ్లిన సందర్భాలున్నాయి. మరొక వైపు చూస్తే పరిశ్రమ పూర్తిగా ట్రాయ్ నియంత్రణలో వుందనే చెప్పాలి.


ఎప్పటి కప్పుడు తాజా పరిస్థితులకు అనుగుణంగా నియమాలను రూపొందించేది. గత ఐదు నుంచి పదేళ్లలో ప్రతి నెల ఎదో ఒక కొత్త నియమం వుండేది. దీని వల్ల అస్థిరమైన పని విధానంతో అనూహ్యమైన వివాదాలు తలెత్తివి.


ఈ కొత్త టారీఫ్ ఆర్డర్ వల్ల, ట్రాయ్ రూపొందించిన కొత్త నియమావళి వల్ల పరిశ్రమ తనలో వున్న లోపాలను గుర్తించడానికి ప్రయత్నించే అవకాశం లభ్యమయింది. దీని వల్ల మార్పులు అనివార్యమై కొత్త నియమాలు అమలులోకి వచ్చాయి. ఇది నిరంతరం సాగే ముగింపు లేని ప్రక్రియ. కొత్త టారీఫ్ ఆర్డర్ విషయంలో కచ్చితంగా ఇదే జరిగిందని చెప్పవచ్చు.


వినియోగదారుల తికమక


సూక్ష్మ నియమాల ఫలితంగా కొత్త టారీఫ్ ఆర్డర్ సంక్లిష్టంగా తయారయింది. వినియోగదారులు తికమక పడ్డారు. అంతే కాకుండా ఈ నియమాల్లో వారి కున్న ఎంపిక హక్కును సరిగ్గా అర్థం చేసుకోలేక పోయారు. ఛానెళ్ల ఎంపిక ప్రక్రియ అనేది వినియోగదారులకు చాలా సంక్లిష్టమైంది. ఆదాయపు పన్ను రిటర్లు దాఖలు చేసే ప్రక్రియ కన్నా కష్టమై పోయిందనే చెప్పాలి.